4, మే 2014, ఆదివారం

జిడ్డు కృష్ణమూర్తి (Jiddu Krishnamurti)

 జిడ్డు కృష్ణమూర్తి
జననంమే 12, 1895
స్వస్థలంమదనపల్లె
రంగంతత్వవేత్త
మరణంఫిబ్రవరి 17, 1986
తెలుగువారిలో ప్రముఖ తత్వవేత్తగా పేరుపొందిన జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895న చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసు (చెన్నై)లో నివాసం పెట్టారు. మద్రాసులోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజం కి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. గ్రంథాలయాధికారి ద్వారా కృష్ణమూర్తి సోదరులు దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలైన అనిబీసెంట్‌చే ఆకర్షింపబడ్డారు. వీరిద్దరినీ అనిబీసెంట్ విద్యాభ్యాసంకై ఇంగ్లాండు పంపించింది. సోదరుని మరణం కృష్ణమూర్తిని కృంగదీసింది. గొప్ప అధ్యాత్మికవేత్తగా చేయాలని తలచిన అనిబీసెంట్ ప్రతిదానికి ప్రశ్నిస్తూ ఆలోచించడంతో కృష్ణమూర్తిలో తత్వవేత్త బయటపడ్డాడు. దేశవిదేశాలలో పలువురిచే అభినందించబడ్డారు. "ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడం" లాంటి ప్రముఖ గ్రంథాలు రచించారు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. ఫిబ్రవరి 17 1986న కృష్ణమూర్తి మరణించారు.

జీవనం:
అనీబీసెంటుచే జిడ్డు కృష్ణమూర్తి ఉన్నత విద్యాభ్యాసంకై వెళ్ళి సారబాన్ విశ్వ విద్యాలయంలో సంస్కృతము, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు. ఇది ఇష్టంలేని కృష్ణమూర్తి తండ్రి కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కోర్టులో దావా వేశాడు. తీర్పు వ్యతిరేకంగా వచ్చిననూ ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని ఆయన కాలిఫోర్నియాకు వెళ్ళిపోయాడు. 1925 లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచడమే కాకుండా ఈ సంఘటన ఆయనలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పటి నుంచీ ఆయన ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద ఆయనకు నమ్మకముండేది కాదు.

తత్వవేత్తగా:
సోదరుని మరణం కృష్ణమూర్తిలో తెచ్చిన దుఃఖం కొంతకాలానికి ఆయనలో ప్రతిక్రియను తెచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. ఆయన నడచేదారిలో గులాబిపూలు పోసేవారు కూడా. ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువు ను కాదని ప్రకటించారు. అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తేబడింది. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని ప్రకటించారు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.


విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, తత్వవేత్తలు, మదనపల్లె, 1895లో జన్మించినవారు, 1986లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక