సట్లెజ్ నదికి చెందిన 5 ఉపనదులలో ఒకటైన బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. 470 కిలోమీటర్ల దూరం ప్రవహించి అమృత్సర్ కు దక్షిణాన హరికె పటాన్ వద్ద సట్లెజ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది నీరు సింధూజలాల ఒప్పందం ప్రకారం భారత్-పాకిస్తాన్ లు వాడుకుంటాయి. ప్రాచీన కాలంలో ఈ నది విపశ నదిగా పిలువబడింది. సట్లెజ్ నదికి చెందిన ఉపనదులలో పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే నది ఇది ఒక్కటే. ఈ నదిపై పోంగ్డ్యాం, లార్జీ జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి.
అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తూర్పు సరిహద్దు ఈ నది కావడం వల్ల చరిత్రలో కూడా ఈ నది ప్రసిద్ధిచెందినది. క్రీ.పూ.326 లో విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ నంద రాజులకు భయపడి ఈ నది దాటకనే వెనుతిరిగాడు. జూన్ 8, 2014న హైదరాబాదు లోని ఒక విద్యాసంస్థకు చెందిన 24 విద్యార్థులు బియాస్ నదిపై ఉన్న లార్జీడ్యాం గేట్లు ఒక్కసారి తెరవడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.
= = = = =
| |||||||||||

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి