22, ఫిబ్రవరి 2015, ఆదివారం

కొండా వెంకటప్పయ్య (Konda Venkatappayya)

కొండా వెంకటప్పయ్య
జననంఫిబ్రవరి 22, 1866
జన్మస్థానంగుంటూరు
రంగంస్వాతంత్ర్యోద్యమం
మరణంఆగస్టు 15, 1949
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, "దేశభక్ర"గా ప్రసిద్ధి చెందిన కొండా వెంకటప్పయ్య ఫిబ్రవరి 22, 1866న గుంటూరులో జన్మించారు. బి.ఎల్. పట్టాపొంది బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళారు. జాతీయోద్యమ సమయంలో మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు. కొండా వెంకటప్పయ్య 1949 ఆగస్టు 15 వ తేదీన దేశ స్వాతంత్ర్యదినాన మరణించారు.

స్వాతంత్ర్యోద్యమం:
జాతీయోద్యమ సమయంలో 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. 1929లో సైమన్ కమీషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలుకు వెళ్ళారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యాడు. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి వెంకటప్పయ్యే.  ఆ తరువాత ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడయ్యాడు. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షడిగా పని చేశాడు. అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాలం సభ్యుడిగా ఉన్నాడు. గ్రంథాలయోద్యమానికె కూడా తోడ్పడ్డాడు. గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవాడు.

కొండా వెంకటప్పయ్య జనరల్ నాలెడ్జి
కొండ కడలూరు జైలులో వున్నప్పుడు "డచ్ రిపబ్లిక్" అనే గ్రంథాన్ని రచించాడు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. "శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి" అన్న భక్తి రసభరితమైన శతకాన్ని రచించాడు. ఆయన ఇంగ్లీషులోనూ తెలుగులోనూ మంచి వక్త, కవి. మొదటి నుంచి నాటకాలంటే కొండా వెంకటప్పయ్యకు చాలా మక్కువ, స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు, గుంటూరు జిల్లా సమరయోధులు, గుంటూరు, 1866లో జన్మించినవారు, 1949లో మరణించినవారు,


 = = = = =


1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక