13, మే 2013, సోమవారం

మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం (Manchiryal Assembly Constituency)

మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాదులోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది కొత్తగా ఏర్పడింది. గతంలో లక్సెట్టిపల్లి పేరుతో ఉన్న నియోజకవర్గం కొద్దిమార్పులతో మంచిర్యాల నియోజకవర్గంగా ఏర్పడింది. సింగరేణి కార్మికులు ఈ నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్నారు. ఈ సెగ్మెంటు పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.


నియోజకవర్గం పరిధిలోని మండలాలు
  • లక్సెట్టిపేట
  • మంచిర్యాల
  • దండేపల్లి


ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 అరవింద్ రెడ్డి తెరాస దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ
2010* అరవింద్ రెడ్డి తెరాస గోనె హన్మంతరావు తెలుగుదేశం పార్టీ
2014 దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ అరవింద్ రెడ్డి తెరాస
2018 దివాకర్ రావు తెరాస ప్రేంసాగర్ రావు కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీచేసిన తెరాసకు చెందిన అరవింద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన ఎన్.దివాకర్ రావుపై 13827 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2010 ఉప ఎన్నికలు:
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెరాస తరఫున విజయం సాధించిన అరవింద్ రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ అరవింద్ రెడ్డి తెరాస తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన గోనె హన్మంతరావుపై 78వేలకు పైగా మెజారిటితో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భాజపా తెరాసకు మద్దతు ఇచ్చింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన దివాకర్ రావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన అరవింద్ రెడ్డిపై 58434 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున నడిపల్లి దివాకర్ రావు, భాజపా తరఫున ఎర్రబెల్లి రఘునాథ్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కొక్కిరాల ప్రేంసాగర్ రావు చేశారు. తెరాసకు చెందిన నడిపెల్లి దివాకర్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొక్కిరాల ప్రేంసాగర్ రావు పై 4848 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక