13, మే 2013, సోమవారం

ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం (Mudhol Assembly Constituency)

ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 6 మండలాలు కలవు. ఈ సెగ్మెంటు ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు
  • కుంటాల
  • కుభీర్
  • భైంసా
  • తానూర్
  • ముధోల్
  • లోకేశ్వరం

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1957 జి.గంగారెడ్డి ఇండిపెండెంట్       

1962 జి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జి.గడ్డన్న    ఇండిపెండెంట్
1967 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ    జి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1972 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ    ఏకగ్రీవ ఎన్నిక
1978 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ భీంరావు కదం జనతాపార్టీ
1983 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ ఏ.హన్మంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 ఏ.హన్మంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ
1989 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ విఠల్ తెలుగుదేశం పార్టీ
1994 బి.నారాయణరావు పటేల్ తెలుగుదేశం పార్టీ జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ
1999 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ బి.నారాయణరావు పటేల్ తెలుగుదేశం పార్టీ
2004 బి.నారాయణరావు పటేల్ తెరాస

2009 ఎస్.వేణుగోపాలచారి తెలుగుదేశం పార్టీ గడ్డం విఠల్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ
2014 గడ్డం విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రమాదేవి భాజపా
2018 G.విఠల్ రెడ్డి తెరాస రమాదేవి భాజపా

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన వేణుగోపాలచారి తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీకి చెందిన గడ్డం విఠల్ రెడ్డిపై 183 ఓట్ల స్పల్ప ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాపోటీచేసిన గడ్డం విఠల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన రమాదేవిపై 14686 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీ భాజపాకు కేటాయించింది.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున జి.విఠల్ రెడ్డి, భాజపా తరఫున పడకంటి రమాదేవి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన రామారావు పటేల్ పవార్ చేశారు. తెరాసకు చెందిన విఠల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భాజపాకు చెందిన పడకంటి రమాదేవిడి పై 43364 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక