18, జూన్ 2013, మంగళవారం

ఎస్వీ రంగారావు (S.V.Ranga Rao)

 ఎస్వీ రంగారావు
(1918-1974)
జననంజూలై 3, 1918
నూజివీడు
జిల్లాకృష్ణా జిల్లా
రంగంసినిమా నటుడు
మరణంజూలై 18, 1974
కృష్ణా జిల్లా నూజివీడులో 1918, జూలై 3న జన్మించిన ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటుడిగా పేరుపొందిన ఎస్వీఆర్ మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించారు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు డిగ్రీ వరకూ అభ్యసించి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించారు.

సినీ ప్రస్థానం:
వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా ఎస్వీ రంగారావు తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, నర్తనశాల, పాండవ వనవాసం, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శనకు ఎంపిక కావడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించడం విశేషం. అద్భుత నటనకు ప్రతీకగా నిల్చి, సినీ విమర్శకుల చేత యస్వీ కాదు యశస్విగా ముద్రవేయించుకున్న ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశారు.

విభాగాలు: తెలుగు సినిమా నటులు, కృష్ణా జిల్లా నటులు, నూజివీడు మండలము, 1918లో జన్మించినవారు, 1974లో మరణించినవారు, 


 = = = = =


3 కామెంట్‌లు:


  1. గొప్ప నటుడు ఎస్వీ రంగారావు గారు. తోడికోడళ్ళు, మాయాబజార్, గుండమ్మ కథ, మంచి మనసులు, మొనగాళ్ళకు మొనగాడు వగైరా కూడా ఎస్వీ గారు అద్భుతంగా నటించిన చిత్రాలు. ఆ మహా నటుడుకి చక్కటి నివాళి.

    రిప్లయితొలగించండి
  2. గొప్ప నటుడు మరియు మంచి మనిషి ఎస్వి రంగారావు .. డైలొగుస్ లొ పొటి ఎవరు లేరు

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక