16, ఫిబ్రవరి 2014, ఆదివారం

జోగు రామన్న (Jogu Ramanna)

జోగు రామన్న
జననంజూలై 4, 1963
స్వస్థలందీపాయిగూడ (ఆదిలాబాదు జిల్లా)
పదవులుతెలంగాన రాష్ట్ర మంత్రి
నియోజకవర్గం ఆదిలాబాదు అ/ని,
జోగు రామన్న ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1963, జూలై 4న దీపాయిగూడ గ్రామంలో జన్మించిన జోగురామన్న 1984లో రాజకీయ ప్రవేశం చేసి గ్రామసర్పంచిగా, మండల అధ్యక్షులుగా, జడ్పీటీసిగా, శాసనసభ్యుడిగా అంచెలంచెలుగాఎదిగి, 2014 జూన్2న తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రిమండలిలో స్థానం పొందారు.

రాజకీయ ప్రస్థానం:
జోగురామన్న 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 1988లో దీపాయిగూడ గ్రామసర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళు కొనసాగారు. 1995లో ఎంపీటీసిగా ఎన్నికై మండల ఉపాధ్యక్షులుగా, మండలాధ్యక్షులుగా పనిచేశారు. 2001, 2006లలో జడ్పీటీసిగా ఎన్నికయ్యారు. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో ఆదిలాబాదు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 27 సంవత్సరాల పాటు కొనసాగిన తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెరాసలో చేరి ఆ పార్టీ తరఫున ఉప ఎన్నికలలో పోటీచేసి మళ్ళీ విజయం సాధించారు. 2014లో తెరాస తరఫున పోటీచేసి ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రిమండలిలో స్థానం పొందారు.



విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, జైనాథ్ మండలం, 1963లో జన్మించినవారు, 13వ శాసనసభ సభ్యులు, ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక