6, మే 2014, మంగళవారం

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (Venkatagiri Assembly Constituency)

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది తిరుపతి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 241. 1989లో ఇక్కడి నుంచి విజయం సాధించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి 1990-92 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
 • కలువోయ, 
 • రాపూరు,
 • సైదాపురం,
 • డక్కిలి,
 • వెంకటగిరి,
 • బాలాయపల్లి


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 అల్లం కృష్ణయ్య ఇండిపెండెంట్ ఏకగ్రీవ ఎన్నిక
1967 ఓరేపల్లి వెంకట సుబ్బయ్య ఇండిపెండెంట్ అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ
1972 ఓరేపల్లి వెంకట సుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ అల్లం కృష్ణయ్య ఇండిపెండెంట్
1978 నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్-ఐ పి.వెంకటస్వామిరెడ్డి జనతాపార్టీ
1983 నల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఇండిపెండెంట్ ఎన్.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 భాస్కర సాయికృష్ణ యాచేంద్ర తెలుగుదేశం పార్టీ పి.బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 ఎన్.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 రాజా యాచేంద్ర వెలుగోటి తెలుగుదేశం పార్టీ ఎన్.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 ఎన్.రాజ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ శారద తాడిపర్తి తెలుగుదేశం పార్టీ
2004 ఎన్.రాజ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ సాయికృష్ణ యాచేంద్ర తెలుగుదేశం పార్టీ
2009 కె.రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎన్.రాజ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
2014 కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ కొమ్మిలక్ష్మయ్యనాయుడు వైకాపా
2019
2004 ఎన్నికలు:
2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మల్యే నేదురుమల్లి రాజ్యలక్ష్మి తన సమీప ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి చెందిన వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్రపై 51135 ఓట్ల మెజారిటితో విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. వైఎస్సార్ మంత్రివర్గంలో రాజ్యలక్ష్మికి విద్యాశాఖ మంత్రిగా పదవి లభించింది.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి, రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేదురుమల్లి రాజ్యలక్ష్మిపై 6766 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కురుగొండ్ల రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన కొమ్మి లక్ష్మయ్యనాయుడుపై 5560 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: నెల్లూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, తిరుపతి లోకసభ నియోజకవర్గం, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక