3, ఏప్రిల్ 2015, శుక్రవారం

కొండపాక మండలం (Kondapak Mandal):

జిల్లామెదక్ జిల్లా
జనాభా48597 (2011)
అసెంబ్లీ నియోగజ్వేల్ అ/ని
లోకసభ నియోమెదక్ లో/ని
ప్రముఖులునందిని సిద్ధారెడ్డి
కొండపాక మెదక్ జిల్లాకు చెందిన మండలము. మండలం గుండా రాజీవ్ రహదారి వెళ్ళుచున్నది. తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత నందిని సిద్ధారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2015, మార్చి 2:న మండలపరిధిలోని మర్పడగ గ్రామంలో విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక అవశేషాలు బయటపడ్డాయి. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
కొండపాక మండలం మెదక్ జిల్లాలో తూర్పు వైపున వరంగల్ జిల్లా సరిహద్దులో 17.97° ఉత్తర అక్షాంశం, 78.85° తూర్పు రేఖాశంపై ఉంది. ఈ మండలానికి ఉత్తారన సిద్ధిపేట మండలం, ఈశాన్యాన నంగనూరు మండలం, దక్షిణాన జగదేవ్‌పూర్ మండలం, పశ్చిమాన తొగుట మండలం, నైరుతిన గజ్వేల్ మండలం, తూర్పున వరంగల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

కొండపాక స్థానం
చరిత్ర:
ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుంచే ప్రశక్తిలో ఉంది. 2015, మార్చి 2న మండలపరిధిలోని మర్పడగ గ్రామంలో విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక అవశేషాలు బయటపడ్డాయి. కాకతీయుల కాలంలో కొండపాక సైనికుల విడిదికేంద్రంగా ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన రుద్రేశ్వరస్వామి ఆలయం మండలకేంద్రంలో ఉంది. ఆధునిక కాలంలో ఈ ప్రాంతం కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలచే పాలించబడి 1948లో భారత యూనియన్‌లో విలీనం అయింది. 1948-56 కాలంలో హైదరాబాదు రాష్ట్రంలో, ఆ తర్వాత 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది.

 జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48597. ఇందులో పురుషులు 24222, మహిళలు 24375. అక్షరాస్యుల సంఖ్య 25236.

నందిని సిద్ధారెడ్డి
రాజకీయాలు:
ఈ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుంచి సిద్ధిపేట వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళుచున్నది.

మండలంలోని గ్రామాలు:
అంకిరెడ్డిపల్లి · ఎర్రపల్లి · ఎలిగడ్డకిస్టాపూర్ · ఎల్లారెడ్డిపేట · కుక్కునూర్‌పల్లి · కొండపాక · కోనాయిపల్లి · గిరాయిపల్లి · జప్తినాచారం · తిప్పారం · తిమ్మారెడ్డిపల్లి · తుక్కాపూర్ · తొగుట · దుద్దాడ · పల్లిపహాడ్ · పి మాసాన్‌పల్లి · బండారుపల్లి · బందారం · మంగోల్ · మాతపల్లి · మాదినిపూర్ · మార్పడగ · ముద్దాపూర్ · లకుడారం · విస్వనాథపల్లి · వెలికట్టు · వేములఘాట్ · శిర్సింగండ్ల · సింగారం


విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు, కొండపాక మండలం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక