కొన్నూర్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 161కిమీ, డోన్ నుంచి 136 కిమీ దూరంలో ఉన్నది. ఇది కురుమూర్తి స్టేషన్ మరియు వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. కొన్నూర్ స్టేషన్ కురుమూర్తి నుంచి 8 కిమీ, వనపర్తి రోడ్ నుంచి 5 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు) మాత్రమే ఆగుతాయి.
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి