8, మార్చి 2013, శుక్రవారం

కురుమూర్తి రైల్వేస్టేషన్ (Kurumurti Railway Station)

కురుమూర్తి రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామములో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 153కిమీ, డోన్ నుంచి 144 కిమీ దూరంలో ఉన్నది. ఇది కౌకుంట్ల స్టేషన్ మరియు కొన్నూర్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. కురుమూర్తి స్టేషన్ కౌకుంట్ల నుంచి 5 కిమీ, కొన్నూర్ నుంచి 8 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు) మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి