మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రధాన రైల్వేస్టేషన్. ఇది దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు డివిజన్ లో సికింద్రాబాదు-డోన్ మార్గంలో ఉంది. హైదరాబాదు డివిజన్ లోనే అతిపెద్ద మరియు అత్యధిక ఆర్జన కలిగిన రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 113 కిమీ, డోన్ నుంచి 184 కిమీ దూరంలో ఉంది. ఈ స్టేషన్ కు ఇరువైపులా పట్టణానికే చెందిన ఏనుగొండ మరియు మహబూబ్ నగర్ టౌన్ (వీరన్నపేట) రైల్వేస్టేషన్లు కలవు. ఏనుగొండ నుంచి 4 కిమీ, వీరన్నపేట నుంచి 2 కిమీ దూరంలో ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే అని ప్రధాన రైలుబండ్లు ఈ స్టేషన్ లో ప్రయాణీకుల కోసం ఆగుతాయి.
ఈ స్టేషన్ లో 4 ప్లాట్ ఫారంలు, 4 ట్రాకులు ఉన్నాయి. 4వ ట్రాకు గూడ్సు రైళ్ళ కోసం పరిమితం చేశారు. స్టేషన్ ముందట విశాలమైన పార్క్, ప్రక్కనే స్టేట్ బ్యాంక్ ఏటీఎం, తపాలా బట్వాడా కేంద్రం ఉన్నాయి. 4వ ప్లాట్ ఫారం వైపు రైల్వే పోలీసు కార్యాలయం ఉంది. 1, 2వ ప్లాట్ ప్లారంలపై ప్రయాణీకుల సౌకర్యార్థం షెడ్, నీటి కుళాయిలు, కూర్చోడానికి వీలుగా బెంచీలు ఏర్పాటుచేశారు. మొదటి ప్లాట్ ఫారంపై రైల్వే క్యాంటీన్, బుక్ సెంటర్, వివిధరకాల సామానులు అమ్మే చిన్న షాప్ ఉన్నాయి. ఒక ప్లాట్ ఫాం నుంచి మరో వైపు వెళ్ళడానికి ఒక ఫుట్ బ్రిడ్జి ఉంది.స్టేషన్ సమీపంలో చిన్న గుట్టపై శ్రీవీరాంజనేయస్వామి ఆలయం ఉంది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ టైంటేబుల్ కొరకు ఇక్కడ చూడండి
= = = = =
|

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి