21, ఏప్రిల్ 2013, ఆదివారం

నారాయణపేట రెవెన్యూ డివిజన్ (Narayanapet Revenue Division)

మహబూబ్‌నగర్  జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో నారాయణపేట రెవెన్యూ డివిజన్ ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ క్రింద 15 మండలాలు, 405 రెవెన్యూ గ్రామాలు, 327 గ్రామపంచాయతీలు కలవు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ జనాభా 8,97,203. ఈ డివిజన్ 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. డివిజన్ పరిధిలో ఒక పురపాలక సంఘం ఉన్నది. మండలాల సంఖ్యలోనూ, జనాభాలోనూ ఈ డివిజన్ 2వ స్థానంలో ఉన్నది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం నారాయణపేట డివిజన్ జనాభా 8,97,203. ఇందులో పట్టణ జనాభా 58,375, గ్రామీణ జనాభా 8,38,828.నారాయణపేట, ఆత్మకూరు, చిన్నచింతకుంట పట్టణ ప్రాంతాలుగా ఉన్నాయి.

నియోజకవర్గాలు
ఈ రెవెన్యూ డివిజన్ పరిధి 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. లోకసభ నియోజకవర్గం మాత్రం ఒక్కటే.

అసెంబ్లీ నియోజకవర్గాలు లోకసభ నియోజకవర్గాలు
  • మహబూబ్‌నగర్ (15 మండలాలు)

విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ డివిజన్లు,  నారాయణపేట  రెవెన్యూ డివిజన్,   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి