9, ఏప్రిల్ 2013, మంగళవారం

పోలెపల్లి ఎల్లమ్మ ఆలయం (Polepalli Yellamma Temple)

200 సంవత్సరాల చరిత్ర కలిగిన పోలెపలి ఎల్లమ్మ ఆలయం బొంరాస్‌పేట్ మండలం పోలెపల్లిలో ఉంది. ఏటా శివరాత్రి ముందువచ్చే గురువారం నుంచి 5 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. 1998లో ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. పూర్వం గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దున్నే సమయంలో గుంటికపై పొడవైన రాతిని ఉంచాడు. సాయంత్రం గుంటికను అలాగే వదిలి మరుసటి రోజు వచ్చి చూడగా రాయి మాత్రం అంతకు ముందు ఉన్న చోటుకు వెళ్ళింది. ఇలా 3 రోజులు జరిగిన పిదప రైతు స్వయంగా పొలంలో ఉండి పరిశీలంచగా రాతి దేవతా రూపంలో యధాస్థానానికి చేరడం గమనించి గ్రామస్థులకు తెలిపాడు. గ్రామప్రజలు అక్కడే ఒక చిన్న ఆలయం నిర్మించారు. క్రమక్రమంగా ఈ చిన్న ఆలయమే ప్రఖ్యాతిచెందింది. దాదాపు 50 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడి మరో ప్రత్యేకత. ఏటా మహాశివరాత్రి ముందు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలలో భాగంగా ఇదివరకు షిడేకు ఓ మహిళను కట్టి ప్రదక్షిణ చేయించేవారు. 

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, బొంరాస్‌పేట్ మండలము, 
= = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి