10, ఏప్రిల్ 2013, బుధవారం

ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయం (Urkondapet Abhayanjaneya Swamy Temple)

మిడ్జిల్ - కల్వకుర్తి రహదారిపై కమాను
అభయప్రదాతగా పేరుపొందిన అభయాంజనేయస్వామి మిడ్జిల్ మండలం ఉర్కొండపేటలో కొలువైయున్నారు. జడ్వర్ల నుంచి కల్వకుర్తి వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఆలయానికి రెండువైపులా కొండలున్నాయి. ఈ ఆలయం అతిపురాతనమైనది. గతంలో ఈ ప్రదేశంలో రెండు గ్రామాలుండేవి. తగాదాల వల్ల రెండు గ్రామాలు తగలిబడిపోగా గ్రామస్థులు కొద్ది దూరంలో కొత్త గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఇదే నేటి గట్టు ఇప్పలపల్లి. శివోప్సకులైన భోజరాయలు ఆంజనేయస్వామిని ప్రతిష్టించదలచి ప్రతిమ కోసం శిలను వెదుకుతూ ఇప్పుడు ఆలయం ఉన్న స్థలానికి చేరాడు. ప్రతిమను మలిచి తరలిస్తుండగా స్వామివారు భోజరాయలకు కలలో కనిపించి తనను ఇక్కడే ప్రతిష్టించాలని కోరినట్లు దానితో భోజరాయలు ఇక్కడే స్వామివారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. ఇరివైపులా రెండు కొండలుండుటచే ఊరుకొండలు అని పేరువచ్చినట్లు అదే ఊర్కొండగా మారినట్లు ప్రతీతి. 22 అడుగుల శివుని విగ్రహం ఇక్కడి మరో ప్రత్యేకత.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  మిడ్జిల్ మండలము,  

= = = = =

2 కామెంట్‌లు: