10, ఏప్రిల్ 2013, బుధవారం

కోయిలకొండ శ్రీరామక్షేత్రం (Koilkonda Srirama Kshetram)

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోయిలకొండలో ఒక ఎత్తయిన కొండపై అతిపురాతనమైన రామాలయం ఉంది. త్రేతాయుగంలో వనవాసంలో భాగంగా శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చినట్లు ప్రతీతి. ఈ కొండనే శ్రీరామకొండగా పిలుస్తారు. ఈ కొండపై ఒక గుహలో రామవిగ్రహం ప్రతిష్టించారు. దీనికెదురుగా ప్రకృతిసిద్ధమైన పెద్ద కొలను ఉంది. కొండపై ఓ బండపై పాదం లాంటి ఆకారాన్ని శ్రీరాముని పాదంగా భక్తులు విశ్వసిస్తారు. సీతమ్మ కూర్చున్న బండను సీతమ్మ గుండుగా పిలుస్తారు. ఇక్కడున్న గుహలలో ఎందరో మునులు తపస్సు చేశారు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువస్తుండగా అందులో కొంతభాగం విరిగి ఈ కొండపై పడినట్లు భక్తుల విశ్వాసం. ఈ కొండపై కూడా వేలాది ఆయుర్వేద మొక్కలున్నాయి. ఆదివారం అమవాస్య వచ్చినప్పుడు కొండపై జాతర జరుగుతుంది. ఈ కొండ సమీపంలోనే చారిత్రాత్మకమైన పెద్ద రాతికోట ఉంది. కోయిలకొండ కోటగా పిలువబడే ఈ కోట తెలుగు రాష్ట్రాలలోని ఏడు గిరిదుర్గాలలో ఒకటిగా చెప్పబడుతుంది. శ్రీరామక్షేత్రం సమీపంలోనే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఉంది. ఇది కూడా పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  కోయిలకొండ మండలము, 

= = = = =
Tags: telangana forts in telugu, telangana temples

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి