13, మే 2013, సోమవారం

ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (Adilabad Assembly Constituency)

ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. 2018లో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన జోగు రామన్న విజయం సాధించారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు
  • ఆదిలాబాదు
  • జైనథ్
  • బేల


ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 శంకర్ రావు కమ్యూనిస్టు పార్టీ

1957 రంగనాథ రావు పి.డి.ఎఫ్.

1962 విఠల్ రావు ఇండిపెండెంట్

1967 కె.రామకృష్ణ సి.పి.ఐ

1972 మసూద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ

1978 సి.రామచంద్రా రెడ్డి ఇండిపెండెంట్

1983 సి.వామన్ రెడ్డి ఇండిపెండెంట్

1985 సి.రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్

1989 సి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ

1994 సి.వామన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

1999 పి.భూమన్న తెలుగుదేశం పార్టీ

2004 సి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 జోగు రామన్న తెలుగుదేశం పార్టీ

2010 జోగు రామన్న తెరాస

2014 జోగు రామన్న తెరాస పాయల్ శంకర్ భాజపా
2018 జోగు రామన్న తెరాస పాయల్ శంకర్ భాజపా

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసిన తెరాసకు చెందిన జోగురామన్న తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో పోటీచేసిన భాజపాకు చెందిన పాయల్ శంకర్‌పై 14715 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున జోగురామన్న, భాజపా తరఫున పాయల్ శంకర్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన గండ్రత్ సుజాత చేశారు. తెరాసకు చెందిన జోగురామన్న తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన పాయల్ శంకర్ పై 26,606 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి