ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందినవారు. 1921 ఫిబ్రవరి 1న సంజీవయ్య జన్మించారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకే తండ్రి మరణించారు. దీనితో కుటుంబం మేనమామతో పాలకుర్తి తరలివెళ్ళింది. సంజీవయ్య పశువులు కాసేపనిచేశారు. 4వ తరగతి తర్వాత అమెరికా బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరి 1938లో ఎస్.ఎస్.ఎల్.సి.లో జిల్లాలోనే ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యారు. చదువు పూర్తయిన పిదప లాయరుగా ప్రాక్టీస్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాలలో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి రాజీనామా చేయడంతో సంజీవయ్య తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1960లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన తొలి దళిత ముక్యమంత్రిగా ఖ్యాతిచెందారు. ఏఐసిసి అధ్యక్షుడిగానూ పనిచేశారు. కేంద్రం లోనూ అనేక పదవులు నిర్వహించిన సంజీవయ్య లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. 1972, మే 7న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: సంజీవయ్య 1950లో తాత్కాలిక పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1952 ఏప్రిల్‌లో సంయుక్త మద్రాసు రాష్ట్ర రాజాజీ మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా నియమితులైనారు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడీన పిదప టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిపదవిని నిర్వహించారు. 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానికపాలన మంత్రిగా కొనసాగినారు. బస్సురూట్ల జాతీయకరణ సందర్భంగా నీలం రాజీనామా చేయడంతో దామోదరం సంజీవయ్య 1960-62 కాలంలో రెండవ ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా తొలి దళిత ముఖ్యమంత్రిగానూ చరిత్ర సృష్టించారు. 1962లో ఏఐసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1964 జనవరిలో జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో స్థానం పొందారు. నెహ్రూ మరణానంతరం అదే ఏడాది లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలోనూ చోటుపొందారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రివర్గమ్లో పరిశ్రమ శాఖను చేపట్టారు. 1971లో మరోసారి ఏఐసిసి అధ్యక్షుడైనారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి