ఏదుట్ల శేషాచలం పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ఒకరు. ఖిల్లఘనపురం మండల కేంద్రానికి చెందిన శేషాచలం వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవిగా పనిచేశారు. ఇతను సంగీత సాహిత్య భరతశాస్త్రాది కళాప్రవీణుడు. ఇతని వంశస్తుల్లో చాలా మంది సంగీత సాహిత్యాలలో ఆరితేరినవారు.
వీరి పూర్వికులు ఒకనాటి జటప్రోలు సంస్థానం సమీపంలోని ఏదుట్ల గ్రామస్తులు. ఈ కవి "జగన్నాటకం" అను యక్షగాన నాటక కావ్యాన్ని రచించారు. కలలో అర్థనారీశ్వరుడు వచ్చి అజ్ఞాపిస్తే రాసిన రచనే "జగన్నాటకం" అని కవి చెప్పుకున్నారు. ఈ కవి ఈ రచనను ఆధ్యాత్మ విద్యానుసారంగా, భరతశాస్త్రానుసారంగా రచించాడు. పరబ్రహ్మ నుండి ప్రకృతి, జీవుడు జన్మించడం, ప్రపంచనాటకం ఆరంభించటం మొదలగు విషయాలన్ని ఇందులో వర్ణితాలు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి