గొట్టిపాటి నరసింహారావు
|
| జననం | జనవరి 12, 1963 |
| స్వస్థలం | యద్ధనపూడి (ప్రకాశం జిల్లా) |
| పదవులు | 2 సార్లు ఎమ్మెల్యే |
| నియోజకవర్గం | మార్టూరు అ/ని, |
| మరణం | డిసెంబరు 7, 2013 |
గొట్టిపాటి నరసింహారావు జనవరి 12, 1963న జన్మించారు. ప్రకాశం జిల్లా యద్ధనపూడి గ్రామానికి చెందిన నరసింహారావు 10వ తరగతి వరకు స్థానికంగానే జడ్పీ పాఠశాలలో అభ్యసించారు ఇంటర్మీడియట్ చిలకలూరిపేతలో పూర్తిచేశారు. ఆ తర్వాత మద్రాసు (చెన్నై) వెళ్ళి టెక్స్‌టైల్స్ రంగంలో వ్యాపారం కొనసాగించారు. ఇతని తండ్రి గొట్టిపాటి హనుమంతరావు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి ఆకస్మిక మరణంతో 1997లో మార్టూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 1999లలో కూడాఅదే స్థానం నుంచి విజయం సాధించారు. 2004లో పినతండ్రి కుమారుడు గొట్టిపాటి రవికుమార్ చేతిలో పరాజయం పొందారు. 2009లో పర్చూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిసెంబరు 7, 2013న మరణించారు..
| విభాగాలు: ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు, యద్ధనపూడి మండలము, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 1963లో జన్మించినవారు, 2013లో మరణించినవారు, |
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి