1, డిసెంబర్ 2013, ఆదివారం

గుండుమాల్ (Gundumal)

 గుండుమాల్ గ్రామము
గ్రామముగుండుమాల్ 
మండలముకోస్గి 
జిల్లానారాయణపేట
జనాభా6617 (2001)
7060 (2011)
గుండుమాల్ నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.2001 లెక్కల ప్రకారం మండల జనాభా 6617. ఈ గ్రామం కోస్గి నుంచి మద్దూరు వెళ్ళు మార్గంలో ఉన్నది. మండల కేంద్రం కోస్గి తర్వాత మండలంలో ఇది రెండవ పెద్ద గ్రామము. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.

స్వాతంత్ర్య సమరయోధుడు గుండుమాల్ గోపాలరావు ఈ గ్రామానికి చెందినవారు. గ్రామ సమీపంలో విశాలమైన గుట్టపై దేవల్ బాలాజీ స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయానికి 250 ఎకరాల ఆలయ భూములున్నాయి. జిల్లాలో అత్యధిక మాన్యాలున్న ఆలయం ఇదే.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6617. ఇందులో పురుషులు 3358, మహిళలు 3259. గృహాల సంఖ్య 1178.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7060. ఇందులో పురుషులు 3528, మహిళలు 3532. గృహాల సంఖ్య 1397. అక్షరాస్యత శాతం 43.98. గ్రామ కోడ్ సంఖ్య 574966. మండలకేంద్రం కోస్గి తర్వాత ఇది మండలంలో రెండో పెద్ద గ్రామము.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా సురేష్‌రెడ్డి ఎన్నికయ్యారు.


విభాగాలు: కోస్గి మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి