1, డిసెంబర్ 2013, ఆదివారం

కోస్గి (Kosgi)

 కోస్గి గ్రామము
గ్రామముకోస్గి 
మండలముకోస్గి 
జిల్లానారాయణపేట
జనాభా21038 (2001)
21218 (2011)
కోస్గి నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము మరియు పురపాలక సంఘం. ఇది మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. ఇక్కడి నుంచి నారాయణపేట (వయా మద్దూర్), దౌల్తాబాదు లకు రహదారులున్నాయి. గ్రామపాలన మేజర్ గ్రామపంచాయతీచే నిర్వహించబడుతుంది. కోస్గిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడాఉంది. 2005 ఆగస్టు 17 నాడు అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫోవిజ్ కోస్గి సందర్శించారు. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 21038. ఇందులో పురుషులు 10581, మహిళలు 10457. గృహాల సంఖ్య 3842.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 21218. ఇందులో పురుషులు 10606, మహిళలు 10609.గృహాల సంఖ్య 4366. అక్షరాస్యత శాతం 53.02. గ్రామ కోడ్ సంఖ్య 574952.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా శ్రీలత ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
రామకృష్ణ వివేకానంద డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి.


విభాగాలు: కోస్గి మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి