1, డిసెంబర్ 2013, ఆదివారం

ముశ్రిఫా (Mushriffa)

 ముశ్రిఫా గ్రామము
గ్రామముముశ్రిఫా 
మండలముకోస్గి 
జిల్లానారాయణపేట
జనాభా2627 (2001)
3414 (2011)
ముశ్రిఫా నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2627. ఇందులో పురుషులు 1276, మహిళలు 1351. గృహాల సంఖ్య 531. జనాభాలో ఈ గ్రామం మండలంలో నాలుగోస్థానంలో ఉంది.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3414. ఇందులో పురుషులు 1673, మహిళలు 1741.గృహాల సంఖ్య 726. అక్షరాస్యత శాతం 40.13. గ్రామ కోడ్ సంఖ్య 574955. 2001 నాటికి ఈ గ్రామం జనాభాలో మండలంలో 4వ స్థానంలో ఉండగా2011 నాటికి 3వ స్థానానికి చేరింది.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా రాములమ్మ ఎన్నికయ్యారు

కాలరేఖ:
2005 ఆగస్టు 17 నాడు అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫోవిజ్ కోస్గి సందర్శించారు. 


విభాగాలు: కోస్గి మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి