15, డిసెంబర్ 2013, ఆదివారం

పినపాక అసెంబ్లీ నియోజకవర్గం (Pinapaka Assembly Constituency)

పినపాక అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • పినపాక
  • మణుగూరు
  • గుండాల
  • పాల్వంచ
  • అశ్వాపురం

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఆర్.కాంతారావు కాంగ్రెస్ పార్టీ పి.వెంకటేశ్వర్లు సి.పి.ఐ.
2014 పి.వెంకటేశ్వర్లు వైకాప శంకర్ నాయక్ తెరాస
2018 రేగ కాంతారావు కాంగ్రెస్ పార్టీ పాయం వెంకటేశ్వర్లు తెరాస

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.కాంతారావు తన సమీప ప్రత్యర్థి, బూర్గుంపాడు సిటింగ్ ఎమ్మెల్యే, సిపిఐకు చెందిన పి.వెంకటేశ్వర్లుపై349 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.వెంకటేశ్వర్లు తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన శంకర్ నాయక్‌పై 14048 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున పాయం వెంకటేశ్వర్లు, భాజపా తరఫున చందా సంతోష్ రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన రేగా కాంతారావు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రేగ కాంతారావు తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన పాయం వెంకటేశ్వర్లు పై 19565 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి