సర్జఖాన్ పేట్ నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ప్రతిపాదిత వికారాబాదు-కృష్ణ రైల్వేలైన్ ఈ గ్రామం మీదుగా వెళుతుంది. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2704. ఇందులో పురుషులు 1301, మహిళలు 1403. గృహాల సంఖ్య 514. జనాభాలో ఈ గ్రామం మండలంలో మూడోస్థానంలో ఉంది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2787. ఇందులో పురుషులు 1349, మహిళలు 1438.గృహాల సంఖ్య 539. అక్షరాస్యత శాతం 50.05. గ్రామ కోడ్ సంఖ్య 574951. 2001 నాటికి ఈ గ్రామం జనాభాలో మండలంలో 3వ స్థానంలో ఉండగా2011 నాటికి 4వ స్థానానికి దిగజారింది. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా రాములుగౌడ్ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి