10, జూన్ 2014, మంగళవారం

ఉరుగ్వే (Uruguay)

ఉరుగ్వే
రాజధానిమాంటెవిడియో
ఖండందక్షిణ అమెరికా
వైశాల్యం1,76,215 చకిమీ
జనాభా 33 లక్షలు
ఉరుగ్వే దక్షిణ అమెరికాకు చెందిన దేశము. అట్లాంటిక్ మహాసముద్రం తీరాన బ్రెజిల్ కిందుగా ఉన్న ఈ దేశ రాజధాని మాంటెవిడియో. 1825లో ఈ దేశం బ్రెజిల్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. స్పానిష్ అధికార భాష కలిగిన ఈ దేశ కరెన్సీ ఉరుగ్వేయన్ పెసో. ఫుట్‌బాల్ ఈ దేశ జనాదరణ కల క్రీడ. ఉరుగ్వే రెండుసార్లు ఫిఫా కప్‌ను, రెండుసార్లు ఒలింపిక్ ఫుట్బాల్ స్వర్ణాలను గెలుచుకుంది. 1,76,215 చకిమీ వైశాల్యం కలిగిన ఈ దేశం దక్షిణ అమెరికాలో రెండో చిన్న దేశం. దక్షిణ అమెరికాలో మకరరేఖకు దిగువన ఉన్న ఏకైక దేశం. ఈ దేశ జనాభా సుమారు 33 లక్షలు.

విభాగాలు: దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి