హిందీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరుపొందిన పైడి జైరాజ్ సెప్టెంబరు 28, 1909న కరీంనగర్‌లో జన్మించారు. హిందీతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ, ఉర్దూ భాషా చిత్రాలలో కూడా నటించారు. ఈయన సరోజినీ నాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకి మేనల్లుడు. మూకీ మరియు టాకీ సినిమాలలో నటించిన జైరాజ్ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆగస్టు 11, 2000న మరణించారు. సినీ ప్రస్థానం: 1929లో జగ్‌మతీ జవానీ మూకీలో తొలిసారిగా నటించిన జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో, 170కి పైగా టాకీ చిత్రాలలో నటించారు. షికారి ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు (1931). హీరోగా ఈయన తొలిచిత్రం రసిలీరాణి (1930, మాధిరీ సరసన). జైరాజ్ పోషించిన పాత్రలలో టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ తదితర చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. 1941లో మాలా చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈయన నటించిన ప్రముఖ సినిమాలు షోలే, బాబీ, తమన్నా, అమర్ కహానీ, సామ్రాట్ పృథ్వీరాజ్. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి