21, ఫిబ్రవరి 2013, గురువారం

చల్లా వెంకట్రాంరెడ్డి (Challa Venkatram Reddy)

 చల్లా వెంకట్రాంరెడ్డి
జననం
స్వస్థలంఆలంపూర్
పదవులుసర్పంచి, ఎమెల్యే,
నియోజకవర్గంఆలంపూర్ అ/ని,
చల్లా వెంకట్రాంరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను మాజీ మంత్రి చల్లా రాంభూపాల్ రెడ్డి కుమారుడు, రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి మనవడు. వెంకట్రాంరెడ్డి 1999లో రాజకీయ రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించారు కాని లభించలేదు. 2003లో ఆలంపూర్ మేజర్ గ్రామపంచాయతి సర్పంచిగా ఎన్నికయ్యారు. 2004లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించిననూ పొత్తులో భాగంగా ఆలంపూర్ అసెంబ్లీ స్థానం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కేటాయించబడింది. దీనితో ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. పునర్విభజనలో ఆలంపూర్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. 2009లో ఆయన కోరిక మేరకు కాంగ్రెస్ పార్టి అబ్రహాంకు టికెట్ కేటాయించగా ఇతను ముందుండి గెలిపించారు.



విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా ప్రముఖులు,  ఆలంపూర్ మండలము, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి