15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కె.అచ్యుతరెడ్డి (K.Achut Reddy)

కూచుకుళ్ళ అచ్యుతరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, విమోచనోద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు. ఇతను 1914 జూలై 20న నాగర్‌కర్నూల్ సమీపంలోని నాగనూల్‌లో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే 1938లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆంధ్రమహాసభ కమిటీ చైర్మెన్ గా, యాక్షన్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1958-60 కాలంలో హైదరాబాదులో సహకార ఎపెక్స్ బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు. 15 సంవత్సరాలపాటు హిందీ ప్రచారసభ అధ్యక్షులుగా ఉన్నారు. 1957లో మరియు 1967లో కోడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి  ఎన్నికయ్యారు. 1971 అక్టోబరు నుంచి 1972 జనవరి 23న మరణించే వరకు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు.

విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రముఖులు, నాగర్‌కర్నూల్ మండలము,  కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం,  రాష్ట్ర మంత్రులు,

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి