14, ఫిబ్రవరి 2013, గురువారం

దేవరకొండ విఠల్ రావు (D.Vittal Rao)

దేవరకొండ విఠల్ రావు వికారాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను బొంరాస్ పేట మండలం లగచర్ల గ్రామంలో నవంబరు 14, 1950న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1975లో కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించారు. 2004 లోకసభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీచేసి తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు చేతిలో ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 2016, మే 28న విఠల్ రావు నిద్రలోనే హఠాత్తుగా మరణించారు.

విభాగాలు: వికారాబాదు జిల్లా ప్రముఖులు,  బొంరాస్‌పేట్ మండలము, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం, 1950లో జన్మించినవారు,2016లో మరణించినవారు

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి