12, మార్చి 2013, మంగళవారం

చిట్టెం రాంమోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy)

చిట్టెం రాంమోహన్ రెడ్డి నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామానికి చెందినవారు. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు నక్సలైట్ల కాల్పులకు గురైన తర్వాత రాజకీయాలలో ప్రవేశించి తండ్రి మరణంతో ఖాళి అయిన మక్తల్ స్థానం నుంచి 2005లో ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2009లో  మక్తల్ నుంచి పోటీచేసి ఇండిపెండెంట్ అభ్యర్థి దయాకర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. 2018లో మూడోసారి శాసనసభకు ఎన్నికైనారు. ఈయన సొదరి డి.కె.అరుణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసింది.

ఇవి కూడా చూడండి:
  • చిట్టెం నర్సిరెడ్డి,
  • డి.కె.అరుణ,

విభాగాలు: నారాయణపేట జిల్లా ప్రముఖులు,  ధన్వాడ మండలము,  మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి