12, మార్చి 2013, మంగళవారం

జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao)

జూపల్లి కృష్ణారావు
జననం జూన్ 10, 1955
స్వస్థలం పెద్దదగడ
పదవులు5 సార్లు ఎమ్మెల్యే,
తెలంగాణ రాష్ట్ర మంత్రి
నియోజకవర్గంకొల్లాపూర్ అ/ని,
జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వీపనగండ్ల మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన జూపల్లి జూన్ 10, 1955న జన్మించారు. డిగ్రీ వరకు అభ్యసించి మొదట బ్యాంకులో క్లర్క్ ఉద్యోగంలో చేరారు. తర్వాత రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించారు. ఆ పిదప రాజకీయాలలో చేరి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 డీసెంబరులో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పదవి పొందారు.

రాజకీయ ప్రస్థానం:
జూపల్లి 1999లో తొలిసారిగాకాంగ్రెస్ పార్టీ తరఫున కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2004లో పొత్తులో భాగంగా ఆ స్థానం తెరాసకు వెళ్ళిననూ జూపల్లి ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసివరసగా మూడవ సారి శాసనసభలో ప్రవేశించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు పొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2012 ఉప ఎన్నికలలో తెరాస తరఫున విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున కొల్లాపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 డీసెంబరు 16న తెలంగాణ మంత్రివర్గంలో పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పదవి పొందారు.


విభాగాలు: వనపర్తి జిల్లా ప్రముఖులు,  వీపనగండ్ల మండలము,  కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, 11వ శాసనసభ సభ్యులు,  12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు13వ శాసనసభ మంత్రులు,  14వ శాసనసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత మంత్రులు,

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి