దేవరకద్ర రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 137కిమీ, డోన్ నుంచి 160 కిమీ దూరంలో ఉన్నది. ఇది కోటకద్ర స్టేషన్ మరియు డోకూర్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. దేవరకద్ర స్టేషన్ కోటకద్ర నుంచి 6 కిమీ, డోకూర్ నుంచి 5 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 8 రైళ్ళు (అన్నీప్యాసింజర్ రైళ్ళు) మాత్రమే ఆగుతాయి. దేవరకద్ర నుంచి కృష్ణ వరకు కొత్తగా రైల్వేలైన్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ఈ స్టేషన్ రైల్వేజంక్షన్ గా మారుతుంది.
= = = = =
|

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి