ఎడ్మకిష్టారెడ్డి మార్చి 22, 1947న జన్మించారు. పీయుసి వరకు
విద్యనభ్యసించి, 1967లో సంయుక్త సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం
చేశారు. మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి
ఇతని రాజకీయ గురువు. 1970లో కల్వకుర్తి మేజర్ గ్రామపంచాయతి వార్డు
సభ్యునిగా ఎన్నికై, 1973లో సర్పంచ్ అయ్యారు. 1975 అత్యవసర పరిస్థితి కాలంలో
జైలుకు వెళ్ళారు. ఏడాది పాటు చంచల్ గూడ జైలులో గడిపారు. 1981లో మరోసారి
కల్వకుర్తి సర్పంచిగా పనిచేశారు. 1986లో కల్వకుర్తి ఎంపిపిగా, 1994లో కల్వకుర్తి నియోజకవర్గం
నుంచి ఇండిపెండెంట్‌గా పాటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998లో
కాంగ్రెస్ పార్టీలో చేరి, 2004లో కాంగ్రెస్ తరఫున రెండోసారి కల్వకుర్తి
నుంచే ఎమ్మెల్యే అయ్యారు. . 2004 ఎన్నికలకు ముందు రైతులకు 9 గంటల విద్యుత్
సరఫరా చేయాలని కల్వకుర్తిలో 8 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. 2009లో
ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీలో చేరి జిల్లా కన్వీనర్‌గా
నియమితులయ్యారు. 2014, ఫిబ్రవరిలో వైకాపా జిల్లా అధ్యక్షుడిగా
నియమించబడ్డారు. ఆగస్టు 19, 2020న మరణించారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి