28, జనవరి 2013, సోమవారం

బి.సత్యనారాయణరెడ్డి (B.Satyanarayana Reddy)

 ( 1927- 2012)
ముఖ్యపదవులుఉత్తరప్రదేశ్, ఒరిస్సా గవర్నరు
జన్మించిన గ్రామంఅన్నారం
జన్మించిన తేదిఆగస్టు 21, 1927
మరణించిన తేదిఅక్టోబరు 6, 2012
భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు నిజాం విమోచనోద్యమకారుడు. ఇతను షాద్‌నగర్ మండలం అన్నారంలో ఆగస్టు 21, 1927న జన్మించి, మొగిలిగిద్ద, హైదరాబాదు లలో విద్య అభ్యసించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు. అక్టోబరు 6, 2012న హైదరాబాదులో మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం
బి.సత్యనారాయణ రెడ్డి ఆగస్టు 21, 1927న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం అన్నారంలో భీంరెడ్డి నర్సిరెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య మొగిలిగిద్దలో ఆ తర్వాత హైదరాబాదులోని వివేకవర్ధిని హైస్కూల్‌, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశలోనే సామ్యవాద భావాలు కలిగిన సత్యనారాయణరెడ్డి 14 ఏళ్ల వయసులోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు.

రాజకీయాలు
ఆచార్య నరేంద్రదేవ్‌, 'లోక్‌నాయక్‌' జయప్రకాశ్‌ నారాయణ్‌, రామ్‌మనోహర్‌ లోహియాల స్ఫూర్తితో తొలుత సోషలిస్టు పార్టీలో క్రియాశీలంగా పాల్గొన్నారు. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1969-71 వరకు తెలంగాణ ప్రజాసమితి పార్టీ చైర్మెన్‌గా ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 'మీసా' చట్టం కింద అరెస్టు కాబడి 18 నెలలు జైలు జీవితం గడిపారు. జైల్లో 'పయామ్‌-ఇ-నవ్‌' అనే హిందీ పత్రిక నడిపి సహచరులకు పంచిపెట్టేవారు. జైలు నుంచి విడుదలైన పిమ్మట జనతా పార్టీలో చేరారు. 1978లో జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1979-82 కాలంలో జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో రెండవసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటరీకి చెందిన కమిటీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1990-93 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా, 1993 నుంచి 1995 వరకు ఒడిషా గవర్నర్‌గా పనిచేశారు. 1993లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి ఇన్‌ఛార్జి గవర్నర్‌గా కొద్దికాలం వ్యవహరించారు. సత్యనారాయణరెడ్డి స్వగ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించారు. దళితులకు పక్కా ఇళ్లు మంజూరు చేయించారు. ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతూ 6.10.2012 న తుది శ్వాస విడిచారు.

వ్యక్తిగత జీవితం
ప్రజాసేవకే అంకితం కావాలన్న ఉద్దేశంతో ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. ఆర్యసమాజ్ ఆదర్శాలను అమలులో పెట్టారు. తనకు సంక్రమించిన 25 ఎకరాల భూమిని అన్న కుమారుడైన రాంచంద్రారెడ్డికి ఇచ్చి, తన శేషజీవితాన్ని రాంచంద్రారెడ్డి వద్దే గడిపారు. ఎమ్మెల్యేగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఇతనికి సొంత పెద్దమ్మ కుమారుడు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా ప్రముఖులు,  షాద్‌నగర్ మండలము, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు, 1927లో జన్మించినవారు, 2012లో మరణించినవారు,
 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, పత్రికలు, వెబ్ సైట్లు:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక