పొడపాటి చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఇతను జూలై 15, 1949న జన్మించారు. బీకాం, ఎల్.ఎల్.బి. అభ్యసించారు. ప్రారంభంలో 1981లో మహబూబ్‌నగర్ పురపాలకసంఘం కౌన్సిలరుగా ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఆ పార్టీలో చేరి ఇటీవలి వరకు ఇదే పార్టీలో కొనసాగారు. 1983లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1994, 1999లలోకూడా ఇదే స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 1983-84లలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ చైర్మెన్‌గా, 1984-85లలో న్యాయశాఖామంత్రిగా, 1985-88 కాలంలో ఆర్టీసీ గోల్కొండ రీజియన్ చైర్మెన్‌గా, 1989లో పంచాయతిరాజ్ మంత్రిగా, 1994లో రవాణాశాఖ మంత్రిగా, 1998లో చిన్న, మధ్యతరహా శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. మట్టిదీపాలు, తోరణాలు, అమ్మవడిలో, కిరణాలు లాంటి రచనలు కూడా చేశారు. 2013, జూన్ 3న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోకసభ స్థానానికి ఇండిపెండెంటుగా నామినేషన్ వేసి ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు.
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి