5, మార్చి 2013, మంగళవారం

రాంచందర్ రావు కళ్యాణి (Ramchander Rao Kalyani)

రాంచందర్ రావు కళ్యాణి నారాయణపేటకు సమరయోధుడు, ఆర్యసమాజ్ నాయకుడు మరియు రాజకీయ నాయకుడు. నారాయణపేట పురపాలక సంఘం తొలి చైర్మెన్, మక్తల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

డిసెంబరు 20, 1916న నారాయణపేట పట్టణంలో జన్మించిన రామచందర్ రావు కళ్యాణి చిన్న వయస్సులోనే ఆర్యసమాజం వైపు ఆకర్షితులైనారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు విమోచనొద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాదు విలీనం అనతరం 1950 నుంచి 65 వరకు సుధీర్ఘకాలం నారాయణపేట పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1962 నుంచి మక్తల్ నియోజకవర్గం నుంచి వరసగా 3 సార్లు ఎన్నికై హాట్రిక్ సాధించారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థి బీఏ రెడ్డిపై, 1967లో సీతారామరావుపై విజయం సాధించగా, 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా కొనసాగినారు. 

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులుమహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, నారాయణపేట మండలము,   మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి