సీతా దయాకర్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ మహిళా రాజకీయ నేతలలో ఒకరు. నిజామాబాదు జిల్లా సదాశివనగర్‌లో అక్టోబరు 27 1961న జన్మించిన సీతకు కొత్తకోట దయాకర్ రెడ్డితో వివాహం జరిగింది. బీఏ వరకు అభ్యసించిన సీత దయాకర్ రెడ్డి 1994లో రాజకీయ ప్రవేశం చేసి 2001లో దేవరకద్ర జడ్పీటీసి సభ్యులుగా విజయం సాధించి ఏకంగా జిలా పరిషత్తు చైర్మెన్ పదవి పొందినారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వర్ణ సుధాకర్ రెడ్డిపై విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికలలో ఈమె మరోసారి దేవరకద్ర నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పొందారు.
బంధుత్వం: భర్త కొత్తకోట దయాకర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో సీత దేవరకద్ర నుంచి ఈమె భర్త కొత్తకోట దయాకర్ రెడ్డి కూడా మక్తల్ నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. ఒకే శాసనసభకు భార్యాభర్తలు ఎన్నిక కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. సీత తండ్రి కామినేని రామేశ్వరారావు సర్పంచిగా పనిచేశారు.
ఉపయుక్త గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి