26, మార్చి 2013, మంగళవారం

ఎస్వీ రామారావు (S.V.Ramarao)

ఆచార్య ఎస్.వి.రామారావు జూన్ 5, 1941న జన్మించారు. వీరి స్వగ్రామం పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్. "తెలుగులో సాహిత్య విమర్శ" అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి 1972లో పీహెడ్‌డి పొందారు. సమవీక్షణం సంపుటికి శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ విమర్శన గ్రంథం పురస్కారం అందుకున్నారు. పాలమూరు జిల్లాలో "జ్యోతిర్మయి" సాహితీసంస్థను నెలకొల్పి కవులను ప్రోత్సహించారు. 35 సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా పనిచేసి 2001 ఏప్రిల్‌లో పదవీవిరమణ పొందారు. 20 గ్రంథాలను, 100 పరిశోధక వ్యాసాలను రచించారు.

ముఖ్యమైన రచనలు:
  • తెలుగులో సాహిత్య విమర్శ (సిద్ధాంత గ్రంథం),
  • కావ్యామృతం (వ్యాస సంపుటం).
  • పాలమూరు సాహితీవైభవం,
  • పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,
  • తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం,



విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు,  పెబ్బేరు మండలము,
= = = = =
ఉపయుక్త గ్రంథాలు:
  • పాలమూరు ఆధునికయుగ కవుల చరిత్ర (కవి పరిచయం),
  • పాలమూరు కవిత,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి