అమ్మాపూర్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 474. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 16 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 138హెక్టార్ల అటవీప్రాంతం ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: అమ్మాపూర్ గ్రామం మండలంలో భౌగోళికంగా మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరమున ఇబ్రహీంబాద్, తూర్పున నాయినోనిపల్లి, ఆగ్నేయాన హన్వాడ, దక్షిణమున మాధారం, పశ్చిమాన దోరసముద్రం గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 474. ఇందులో పురుషులు 228, మహిళలు 246. మండలంలోని చిన్న గ్రామాలలో ఇది ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 992. ఇందులో పురుషులు 504, మహిళలు 488. గృహాల సంఖ్య 164, అక్షరాస్యత శాతం 33.4%. గ్రామ కోడ్ సంఖ్య 575062. విద్యాసంస్థలు: గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉంది.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి