అయోధ్యనగర్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 764. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 26 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 60 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: అయోధ్యనగర్ గ్రామం మండలంలో భౌగోళికంగా వాయువ్యమున ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరమున షేక్‌పల్లి గ్రామం, పశ్చిమమున కొంతవరకు కోయిలకొండ మండలం సరిహద్దుగా ఉండగా మిగితా అన్నివైపులా గుండ్యాల్ గ్రామం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 764. ఇందులో పురుషులు 397, మహిళలు 367. మండలంలోని చిన్న గ్రామాలలో ఇది ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 855. ఇందులో పురుషులు 429, మహిళలు 426. గృహాల సంఖ్య 162, అక్షరాస్యత శాతం 41.6%. గ్రామ కోడ్ సంఖ్య 575056. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 66 ఓట్లు ఆధిక్యత లభించింది. విద్యాసంస్థలు: గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి