బోయపల్లి మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 8036. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 4 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేట వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది. ఇది పూర్వం గ్రామపంచాయతీగా ఉండేది. 2011లో ఈ గ్రామాన్ని మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేశారు.
భౌగోళికం, సరిహద్దులు: బోయపల్లి గ్రామం భౌగోళికంగా మహబూబ్‌నగర్ మండలంలో ఉత్తరం వైపు ఉంది. ఈ గ్రామానికి ఉత్తరాన జమిస్తాపూర్, దక్షిణాన మహబూబ్‌నగర్ పట్టణం, తూర్పున ఎరవల్లి గ్రామాలుండగా పశ్చిమాన హన్వాడ మండలము, ఉత్తరాన కొంతవరకు నవాబ్‌పేట మండలము సరిహద్దులుగాఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8036. ఇందులో పురుషులు 4029, మహిళలు 4007. 2001 నాటికి ఇది జనాభాలో మండలంలో ప్రథమస్థానంలో ఉంది.
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేట వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు నవాబ్‌పేట రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో కొత్తగంజ్ వద్ద నవాబ్‌పేట వెళ్ళు మార్గంలో ఉన్న రైల్వేగేటును బోయపల్లి రైల్వేగేటుగా పిలుస్తారు.
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి