26, ఏప్రిల్ 2013, శుక్రవారం

ధర్మాపూర్ (Dharmapur)

 
ధర్మాపూర్ గ్రామము
గ్రామముధర్మాపూర్
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3732
ధర్మాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3732. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 7 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది. ధర్మాపూర్ శివారులో జయప్రకాష్ నారాయణ ఇంజనీర్ కళాశాల ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ధర్మాపూర్ గ్రామం భౌగోళికంగా మహబూబ్‌నగర్ మండలంలో దక్షణం వైపు ఉంది. ఈ గ్రామానికి తూర్పున అల్లీపూర్, పశ్చిమాన కదూర్, జమిస్తాపుర్, ఉత్తరాన మహబూబ్‌నగర్ పట్టణ శివారు, దక్షిణాన అడ్డాకల్, భూత్పూర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3732. ఇందులో పురుషులు 1893, మహిళలు 1839. ఇది మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా అతి కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు రాయచూరు ప్రధాన రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా పసుల వసంత్ ఎన్నికయ్యారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి