దాచక్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2008లో గ్రామానికి నిర్మల్ పురస్కారం లభించింది. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 892. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 8 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 642 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. గ్రామంలో తిరుమలనాథస్వామి ఆలయం ఉంది.
జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 892. ఇందులో పురుషులు 440, మహిళలు 452. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1495. ఇందులో పురుషులు 759, మహిళలు 736. గృహాల సంఖ్య 310, అక్షరాస్యత శాతం 34.1%. గ్రామ కోడ్ సంఖ్య 575072. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి మహాకూతమి అభ్యర్థి తెరాసకు చెందిన ఇబ్రహీంకు 14 ఓట్ల మెజారిటి లభించింది. విద్యాసంస్థలు: గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. దయ్యాలమర్రి తండాలో ప్రాథమిక పాఠశాల ఉంది.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి