24, ఏప్రిల్ 2013, బుధవారం

వేపూర్ (Vepur)

వేపూర్ గ్రామము
గ్రామమువేపూర్
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4205 (2001)
4847 (2011)
వేపూర్ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4205. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 25 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 152 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది. గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
వేపూర్ గ్రామం భౌగోళికంగా మండలంలో పశ్చిమం వైపున కోయిలకొండ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున గుండ్యాల్, పశ్చిమాన చీకర్లపల్లి (నిర్జన) గ్రామాలు సరిహద్దులుగాఉండగా, ఉత్తరమున మరియు దక్షిణమున కోయిలకొండ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4205. ఇందులో పురుషులు 2098, మహిళలు 2107. ఇది మండలంలో మూడవ పెద్ద గ్రామము.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4847. ఇందులో పురుషులు 2413, మహిళలు 2424. గృహాల సంఖ్య 912, అక్షరాస్యత శాతం 40.7%. గ్రామ కోడ్ సంఖ్య 575054,

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి 402, మహాకూటమికి 347, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 307 ఓట్లు లభించాయి.

విద్యాసంస్థలు
గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. మండల పరిషత్తుకు చెందిన ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. రామన్నపల్లి, ఎంఎం కుంట తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి