28, ఏప్రిల్ 2013, ఆదివారం

ఫతేపూర్ (Fathepur)

ఫతేపూర్ గ్రామము
గ్రామముఫతేపూర్
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2083 (2001)
ఫతేపూర్ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2083. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 15 కిమీ దూరంలో ఉంది. భౌగోళికంగా ఈ గ్రామం మండల సరిహద్దు నుంచి దూరంగా నవాబ్‌పేట, హన్వాడ మండలాల మధ్యలో ఉంది. ఇది ఎంపీటిసి నియోజకవర్గం కేంద్రం.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో ఉత్తరం వైపున మండలపు ప్రధాన భూభాగపు సరిహద్దు లేకుండా దూరంగా ఉంది. హన్‌వాడ మరియు నవాబ్‌పేట మండలాలు ఈ గ్రామానికి సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2083. ఇందులో పురుషులు 1034, మహిళలు 1049. గృహాల సంఖ్య 398.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా ఆరెకటిక పండరినాథ్‌జీ ఎన్నికయ్యారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి