28, ఏప్రిల్ 2013, ఆదివారం

జైనల్లిపూర్ (Jainallipur)

జైనల్లిపూర్ గ్రామము
గ్రామముజైనల్లిపూర్
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1768 (2001)
జైనల్లిపూర్ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2404. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 9 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో ఉత్తరం వైపున నవాబ్‌పేట, హన్వాడ మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, వాయువ్యాన హన్వాడ మండలం సరిహద్దుగా ఉండగా మిగితా అన్నివైపులా బోయపల్లి గ్రామం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1768. ఇందులో పురుషులు 879, మహిళలు 889. గృహాల సంఖ్య 332.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా జి.యాదయ్య ఎన్నికయ్యారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి