13, ఏప్రిల్ 2013, శనివారం

గద్వాల రెవెన్యూ డివిజన్ (Gadwal Revenue Division)

మహబూబ్ నగర్ జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో గద్వాల రెవెన్యూ డివిజన్ ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ క్రింద 9 మండలాలు, 202 రెవెన్యూ గ్రామాలు, 196 గ్రామపంచాయతీలు కలవు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ జనాభా 6,08,494. ఈ డివిజన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. డివిజన్ పరిధిలో 2 పురపాలక సంఘాలు కూడా ఉన్నాయి. మండలాల సంఖ్యలోనూ, జనాభాలోనూ ఈ డివిజన్ 4వ స్థానంలో ఉన్నది. 

జనాభా:
2011 లెక్కల ప్రకారం గద్వాల డివిజన్ జనాభా 6,08,494. ఇందులో పట్టణ జనాభా 63,489, గ్రామీణ జనాభా 5,45,005. గద్వాల ఒక్కటే పట్టణ ప్రాంతము కాగా 2012లో ఐజను పురపాలక సంఘం (నగరపంచాయతి)గా ప్రకటించడంతో డివిజన్‌లో రెండు పురపాలక సంఘాలయ్యాయి.

నియోజకవర్గాలు
ఈ రెవెన్యూ డివిజన్ పరిధి 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. లోకసభ నియోజకవర్గం మాత్రం ఒక్కటే.

అసెంబ్లీ నియోజకవర్గాలు లోకసభ నియోజకవర్గాలు
  • ఆలంపూర్ (5 మండలాలు}
  • గద్వాల (4 మండలాలు)
  • నాగర్ కర్నూల్ (9 మండలాలు)

విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ డివిజన్లు, గద్వాల రెవెన్యూ డివిజన్,   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి