వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కల్లూరులో జన్మించిన ఎల్లూరి శివారెడ్డి ప్రస్తుతం తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్తలలో ఒకరు. ఎం.ఏ.(తెలుగు)లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రథమస్థానం సాధించి స్వర్ణపతకం పొందారు. ఆ తర్వాత "ఆంధ్రమహాభారతంలో రసపోషణ" అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి పీ.హెచ్‌డి పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి రీడరుగా, ప్రొఫెసరుగా, తెలుగు శాఖాధిపతిగా పనిచేసి 2012 జూన్ లో తెలుగు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా నియమించబడ్డారు. రసరేఖలు, భావదీపాలు, పులికారు లాంటి రచనలు వీరిద్వారా వెలువడ్డాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి