19, ఏప్రిల్ 2013, శుక్రవారం

గుడిమల్కాపూర్ (Gudimalkapur)


గుడిమల్కాపూర్
గ్రామముగుడిమల్కాపూర్
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1578 (2001),
1972 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575071
గుడిమల్కాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1578. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 11 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 210 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. 2008లో గ్రామానికి నిర్మల్ పురస్కారం లభించింది. 2006-11 కాలంలో సర్పంచిగా బాలాగౌడ్, ఉప సర్పంచిగా అంజిలయ్య పనిచేశారు.

భౌగోళికం, సరిహద్దులు:
గుడిమల్కాపూర్ గ్రామం హన్వాడ మండలములో తూర్పు భాగంలో ఉన్నది. ఉత్తరమున కోంతభాగం రంగారెడ్డి జిల్లా సరిహద్దు ఉండగా, తూర్పున తోకవలె ఉన్న భాగం నవాబ్‌పేట మండలంలోకి చొచ్చుకొనిపోయింది. దక్షిణాన దాచక్‌పల్లి గ్రామం, పశ్చిమాన బుద్ధారం, టంకర గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1578. ఇందులో పురుషులు 799, మహిళలు 779.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1972. ఇందులో పురుషులు 996, మహిళలు 976. గృహాల సంఖ్య 380, అక్షరాస్యత శాతం 46.7%. గ్రామ కోడ్ సంఖ్య 575071.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 172ఓట్ల మెజారిటి లభించింది. రాజేశ్వర్ రెడ్డికి 300 ఓట్లు, తెరాస అభ్యర్థి ఇబ్రహీంకు 128, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 124, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 48 ఓట్లు లభించాయి.

విద్యాసంస్థలు:
గ్రామంలో గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్తు మాధ్యమిక పాఠశాల ఉంది. పెద్దపలుగుతండాలో ప్రాథమిక పాఠశాల ఉంది.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి